Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వ‌రించిన‌ నోబెల్

భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.
Nobel Prize in Physics 2023

2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌ను నోబెల్‌కు ఎంపిక‌చేసింది.

Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్‌, వెయిస్‌మన్‌కు నోబెల్

ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్‌  పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను  వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసిన‌ట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ తెలిపింది.

Norman Borlaug Award: స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు

వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్‌లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. ప్రైజ్ మనీని ముగ్గురి శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు.

Nobel Prize Money: నోబెల్ పురస్కారం నగదు భారీగా పెంపు

#Tags