Indira Gandhi Peace Prize-2021: ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన సంస్థ?

వ్యక్తులు, సంస్థలకు అందించే ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం–2021కి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ ఎంపికైంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీ.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డుకు ప్రథమ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ నవంబర్‌ 19న తెలిపింది. పురస్కారం కింద రూ. 25 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.

నాణ్యమైన విద్యను అందించేందుకు..

1995 ఏడాదిలో ముంబైలో మాధవ్‌ చవాన్, ఫరీదా లాంబేలు ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ప్రతి చిన్నారీ బడిలో ఉండాలని, నాణ్యమైన విద్యను అభ్యసించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తోంది. తొలుత ముంబైలో మురికివాడల్లో బాల్వాడీలు, ప్రీ–స్కూళ్లను ఏర్పాటు చేసి అనంతరం తన సేవలను విస్తరించింది.
చ‌ద‌వండి: యూఎన్‌డబ్ల్యూటీఓ పర్యాటక అవార్డుకు ఎంపికైన గ్రామం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం–2021కి ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌
ఎందుకు : పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags