Shaw Prize: భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డు

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి షా బహుమతి ల‌భించింది.

విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుళ్ళు, గామా కిరణాల వెల్లువ వంటి ఖగోళ దృగ్విషయాలపై శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త కులకర్ణి.

ప్రస్తుతం కులకర్ణి అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఖగోళ శాస్త్రం, గ్రహ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

అమెరికాలోని పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీ మరియు జ్వికీ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీలలో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళ దృగ్విషయాలను పరిశీలించి, వాటిపై విశేష పరిశోధనలు చేశారు. 

Pulitzer Prize Winners: 2024 పులిట్జర్ బహుమతులు.. విజేతల పూర్తి జాబితా ఇదే..

2024 సంవత్సరానికి ఖగోళ శాస్త్ర విభాగంలో ఈ అవార్డును షా ప్రైజ్ ఫౌండేషన్ మే 21న ప్రకటించింది. ఈ అవార్డు భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, వైద్యం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, కళలు, సాహిత్యం వంటి విభాగాలలో కూడా అందించబడుతుంది.

#Tags