Physics Wallah: స‌క్సెస్ కావాలంటే అజ్ఞానం ఉండాలంటున్న వేల కోట్ల అధిప‌తి... 5 వేల‌తో ప్రారంభ‌మై...

సక్సెస్‌ కావాలంటే అజ్ఞానం కూడా ఉండాలి అంటారు ఫిజిక్స్‌వాలా ఫేమ్‌ అలక్‌ పాండే. అతడి మాటల తాత్పర్యం.. నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడూ ఏమి తెలుసుకోలేము ఏమి తెలియదు అనుకున్నప్పుడే అన్ని తెలసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. అదే విజయానికి దారి చూపుతుంది.
Physics Wallah: స‌క్సెస్ కావాలంటే అజ్ఞానం ఉండాలంటున్న వేల కోట్ల అధిప‌తి... 5 వేల‌తో ప్రారంభ‌మై...

ప్రయాగ్‌రాజ్‌లో ట్యూషన్‌లు చెప్పి కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళలా సహకరించిన స్టార్‌ ఎంటర్‌ప్రెన్యూసర్‌ అతడి ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ఫిజిక్స్‌ వాలా శాఖోపశాఖలుగా విస్తరించి యూనికార్స్‌ క్లబ్‌లో చేరింది. 

Rajinder Gupta: రోజుకు రూ.30తో ప్రారంభించి... నేడు రూ.12 వేల కోట్ల‌కు అధిప‌తి... రాజేంద‌ర్ గుప్తా స‌క్సెస్ జ‌ర్నీ..!

సక్సెస్‌వాలా స్ట్రాంగ్‌ స్టోరీ. పాఠాలను పాఠాలుగా మాత్రమే బోధించాలని లేదు. వాటిని నిజజీవితంలోకి తీసుకువచ్చి, హాస్యం జోడించి చెబితే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ‘ఫిక్షనుకు ఫ్రిక్షన్‌కు తేడా ఏమిటి?’ నుంచి జటిలమైన భౌతికసూత్రాలను సులభంగా చెప్పడం వరకు అలక్‌ పాండే అద్భుతమైన నేర్పును సాధించాడు. 

ఈ ఫస్ట్‌–జెనరేషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కొన్ని సంవత్సరాల క్రితం ‘ఫిజిక్స్‌వాలా’ పేరుతో ఫ్రీ యూట్యూబ్‌ చానల్‌కు శ్రీకారం చుట్టాడు. ‘పెద్ద సక్సెస్‌ సాధించబోతున్నాను’ అని ఆ సమయంలో అతను అనుకొని ఉండడు. అతడు అనుకున్నా, అనుకోకపోయినా ‘ఇస్రో’వారి రాకెట్‌లా ఫిజిక్స్‌వాలా దూసుకుపోయింది.

31 మిలియన్‌ల సబ్‌స్రైబర్‌లు, 61 యూట్యూబ్‌ చానల్స్, 5.3 బిలియన్‌ వ్యూస్‌! ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మేలు’ అనుకునే రకం కాదు అలక్‌. ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు మనదైన స్టైల్‌ను బయటికి తీయాలి’ అని బలంగా నమ్ముతాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం నుంచి వచ్చిన అలక్‌ ‘మాకు ప్రతి రపాయి వందరపాయలతో సవనంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు.

Record Salary: అత్య‌ధిక వేత‌నంతో అద‌ర‌గొట్టిన షాప్ కీప‌ర్ కొడుకు... కోట్ల ప్యాకేజీల‌తో ఆద‌ర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు

అలక్‌ ఎడ్‌టెక్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తాను వేసుకున్న ప్రశ్న ‘స్టూడెంట్స్‌ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?’ ఈ ప్రశ్నకు ఊహల్లో నుంచి సమాధానం తీసుకోకుండా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాడ్లాడాడు. వారు చెప్పిన ప్రతీదాన్ని నోట్‌ చేసుకొని లైవ్‌ ఆన్‌లైన్‌ కాసులలో అప్లై చేశాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కోంగ్‌ సెంటర్‌ల ద్వారా బాగా డబ్బు గడింన అలక్‌ పాండేకు ‘ఫిజిక్స్‌వాలా’ చానల్‌ ద్వారా వచ్చిన యాడ్‌ మనీ ఎనిమిది వేలు చాలా తక్కువ. అయితే ఇది ‘శుభారంభం’ అని మాత్రమే అనుకున్నాడు అలక్‌. అతడి నమ్మకం వృథా పోలేదు యాడ్‌ మనీ ఊహించని స్థాయిలో పెరుగుతూ పోయింది. 

కొన్నిసార్లు విద్యార్థులే ఉపాధ్యాయులై చక్కని సలహాలు ఇస్తారు. కొత్తలో అలక్‌ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్డాడు. ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంతగా సక్సెస్‌ అవుతాం అనుకునేవాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు... ‘యాడ్స్‌ మీద కాదు టీచింగ్‌ మీద దృష్టి పెట్టండి’ అని చెప్పారు.

చ‌ద‌వండి: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

ఇక అప్పటి నుం యాడ్స్‌పై కాకుండా టీచింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ‘ఫిజిక్స్‌వాలా క్లాస్‌లలో చక్కగా అర్థమవుతుంది’ అనే మౌత్‌టాక్‌ వచ్చేలా కృషి చేశాడు. చాలామంది విజేతలలాగే అలక్‌ పాండేకు ఎదురయ్యే ప్రశ్న.... ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అది చెప్పడానికి అలక్‌ నోరు విప్పనక్కర్లేదు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనంలోని అతని ఆఫీసు గోడపై అతికించిన పోస్టర్‌లు చూస్తే చాలు. మచ్చుకు రెండు... ‘సక్సెస్‌ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్‌ బీ గురించిన ఆలోచనే రాదు’ ‘వేగంగా పరాజయం పాలైనా సరే, నిదానంగా గట్టి విజయం సాధించాలి’.

#Tags