Bengaluru: నెట్టింట వైర‌ల‌వుతున్న ఆటోవాలా ఇన్ఫిరేష‌న్ జ‌ర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!

చ‌దువుకోవాల‌నే త‌ప‌న ఉండాలే గానీ, వ‌య‌సుతో సంబంధంలేద‌ని నిరూపిస్తున్నాడు ఓ ఆటోవాలా.! పీయూసీ చ‌ద‌వాల‌నుకున్న త‌న క‌ల‌ను సాకారం చేసుకుంటున్నాడు. పెళ్లై, పిల్లలున్నా త‌న ల‌క్ష్యాన్ని అత‌ను మ‌ర్చిపోలేదు.
నెట్టింట వైర‌ల‌వుతున్న ఆటోవాలా ఇన్ఫిరేష‌న్ జ‌ర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!

ఇత‌గాడి గురించి ఓ బెంగ‌ళూరు యువ‌తి త‌న ఎక్స్‌ (ట్విట‌ర్‌)లో పంచుకుంది. ఇప్పుడు ఆ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఆ పోస్ట్‌లోని వివ‌రాలు ఇలా ఉన్నాయి...

బెంగ‌ళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ రైడ్ ఆటోడ్రైవ‌ర్ భాస్క‌ర్ రిసీవ్ చేసుకున్నాడు. ప్ర‌యాణంలో నిధి, డ్రైవ‌ర్ భాస్క‌ర్ మాటామంతీ క‌లిపారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర్‌తో మాట్లాడుతున్న సమ‌యంలో అత‌ని విద్యార్హ‌త వివ‌రాలు తెలుసుకుంది నిధి. తాను ప్రీ- యూనివర్సిటీ(పీయూసీ) పరీక్ష రాసి వ‌స్తున్నాన‌ని చెప్ప‌డంతో ఆమె ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోనైంది. 

ఇవీ చ‌ద‌వండి: ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు..  

తాను 1985లోనే ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేశాన‌ని.. ఆ త‌ర్వాత‌ స్కూల్ మానేశాన‌ని, కుటుంబ ప‌రిస్థితుల‌తో చ‌దువుకు టాటా చెప్పి బ‌తుకు ప‌య‌నం సాగించాల్సివ‌చ్చింద‌ని అత‌డు త‌న‌ జ్ఙాప‌కాల‌ను నిధితో పంచుకున్నాడు. ఇప్పుడు పెళ్లై భార్య‌, పిల్ల‌లు ఉన్నార‌ని.. త‌న పిల్ల‌లు కూడా చ‌దువుకుంటున్నార‌ని చెప్పాడు. ఉన్నత విద్య చదవాలనే తపనతోనే పీయూసీ ప‌రీక్ష‌లు రాస్తున్నాన‌న్నాడు. 

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1 Ranker Chaitanya Success Story

ఆటో డ్రైవర్ భాస్క‌ర్ ఫొటోతో నిధి అగర్వాల్ పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడ‌ది వైర‌ల‌య్యింది. చదువుపై భాస్క‌ర్‌కు ఉన్న శ్రద్ధ ప్ర‌తి ఒక్క‌రికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

#Tags