April Exams Dates: రేపే గ్రూప్-4 ఎగ్జామ్‌... ఏప్రిల్ నెల ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే

ఏపీపీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్‌-4 జూనియ‌ర్ అసిస్టెంట్‌/కంప్యూట‌ర్ అసిస్టెంట్ మెయిన్స్ ప‌రీక్ష ఏప్రిల్ 4వ తేదీ నిర్వ‌హించనున్నారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌కు ఇప్ప‌టికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత స‌మ‌యానికి ప‌రీక్ష కేంద్రాల‌కు అభ్య‌ర్థులు చేరుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 4వ తేదీనే తెలంగాణ హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ సీబీటీ ఎగ్జామ్ కూడా జ‌ర‌గ‌నుంది.
April Exams Dates

ఏప్రిల్ 4, 5 - తెలంగాణ హైకోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌&ఎగ్జామిన‌ర్ ప‌రీక్ష ఏప్రిల్ 4, 5వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది.
ఏప్రిల్ 15 - ఎస్ఎస్ఎస్ నిర్వ‌హించే కానిస్టేబుల్ ప‌రీక్ష‌కు సంబంధించి ఫిజిక‌ల్ టెస్ట్ ఏప్రిల్ 15వ తేదీ జ‌ర‌గ‌నుంది.
ఏప్రిల్ 16 - యూపీఎస్సీ నిర్వ‌హించే సీడీఎస్ ఎగ్జామ్.. అలాగే యూపీఎస్సీ నిర్వ‌హించే నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్‌డీఏ) ప‌రీక్ష ఏప్రిల్ 16వ‌ తేదీ జ‌ర‌గ‌నుంది.

చ‌ద‌వండి: ఉద్దేశ‌పూర్వ‌కంగానే పేప‌ర్ లీక్.. రేప‌టి ప‌రీక్ష‌లు య‌థాత‌థం
ఏప్రిల్ 23 -  టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ ప‌రీక్ష ఏప్రిల్ 23వ తేదీజ‌ర‌గ‌నుంది.
ఎక్సైజ్ కానిస్టేబుల్ - టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫైన‌ల్ ఎగ్జామ్ 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ - తెలంగాణ పోలీస్‌-ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వ‌హిస్తారు.
Telangana Police Constable (Driver) Exam 11 & 26-03-2023, 02, 04, 08, 09 & 30-04-2023 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

చ‌ద‌వండి: SI హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

#Tags