SI Exams Hall Tickets: ఫొటో ప్రూఫ్ లేకుంటే ఎంట్రీ ఉండదు... SI హాల్ టికెట్లు వచ్చేశాయ్... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఉదయం 10 నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ మూడో తేదీ నుంచి నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చదవండి: పేపర్‌ను షేర్ చేసిన ఇన్విజిలేటర్.. రంగంలోకి దిగిన పోలీసులు
ఫొటో అతికిస్తేనే ఎంట్రీ....
ఏదైనా కారణంతో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే support@tslprb.inకు మెయిల్ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ4 సైజ్ కాగితంపై ప్రింట్ తీసుకొని, పాస్‌పోర్ట్ ఫొటో అంటించాలి. ఫొటో గుర్తింపులేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా... వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో ఏర్పాటు చేశారు.
చదవండి: ఇకపై కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు రెడీ... ఎప్పటినుంచంటే