10th Class Paper Leak: పేపర్‌ను షేర్ చేసిన ఇన్విజిలేటర్.. ప్రభుత్వం సీరియస్... రంగంలోకి దిగిన పోలీసులు
చదవండి: బిగ్ బ్రేకింగ్... మొదటి రోజే టెన్త్ పరీక్ష పేపర్ల లీక్..!
ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు
పరీక్షలో విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్విజిలేటరే పరీక్ష పత్రాన్ని వివిధ మీడియా గ్రూపుల్లో షేర్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. అయితే కేవలం 7 నిమిషాల్లోనే అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై వెంటనే అటు పోలీసులు, ఇటు విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తాండూరు మండల ఎంఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో పరీక్ష ప్రారంభమైన తర్వాతే పేపర్ బయటికి వచ్చినట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు. అయితే పేపర్ ప్రారంభానికి ముందే లీక్ అయ్యిందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేశారు.
చదవండి: తెలంగాణలో పది పరీక్షలు ప్రారంభం ఎంతమంది రాస్తున్నారంటే
ప్రభుత్వం సీరియస్..!
అయితే మొబైల్ ఫోన్‌ను ఇన్విజిలేటర్ లోనికి ఎలా తీసుకెళ్లారో తెలియాల్సి ఉంది. లీకేజీ ఘటన బయటికి రాగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్‌ను వెంటనే విధుల నుంచి తప్పించింది. అలాగే ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.