IT Jobs For Inter Candidates : ఇంట‌ర్ పాసైతే చాలు.. HCLలో భారీగా ఉద్యోగాలు.. రూ.1.7 లక్షలు నుంచి రూ.2.2 లక్షల వరకు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : చాలా మంది ఇంట‌ర్ అర్హ‌త‌తో.. ఉద్యోగాలు ఏమి వ‌స్తాయి..? ఈ అర్హ‌త‌కు ఉద్యోగాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి అనుకుంటారు. వీరిలో కొంద‌రు పై చదువులు చదవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం.., ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవ్వడం చేస్తూ ఉంటారు.

వీరికి ఈ దిగ్గజ కంపెనీ గుడ్ న్యూస్..
ఈ రోజుల్లో ఇంట‌ర్ అర్హ‌త‌తో ప్రభుత్వ ఉద్యోగాలే తప్పా, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే.. కనీసం డీగ్రి ఉండాలి. మరి అలా ఇంట్లోనే ఇంటర్ చేసి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నవారు కోసం తాజాగా ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇంటర్ పాసైనా వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాసై ఇంట్లోనే ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అని బాధపడుతున్నారా.. కానీ, ఇకపై ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటర్ పాసై ఇంట్లోనే ఖాలీగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాదు ప్రవైట్ ఉద్యోగం కూడా చేయవచ్చంటూ ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.

☛ Indian Railway Apprenticeship Recruitment 2024: భారత రైల్వేలో 11004 పోస్టులు.. పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఇందుకోసం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు..
ఇంతకి ఏమిటంటే.. ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం కంపెనీ హెచ్‌సీఎస్‌  తాజాగా ఇంటర్ చదివిన విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. అయితే ఈ ప్రోగామ్ ను హెచ్ సీఎల్ టెక్‌బీ పేరుతో నిర్వహిస్తుంది. 

ఇంటర్ విద్యాశాఖ.. 
అయితే ఇందుకోసం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తూ చేసుకోవాలని.. ఆ తర్వాత ఏడాది శిక్షణ అనంతరం హెచ్ సీఎల్ లో పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా నియమితులవుతారని ఇంటర్ విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఆసక్తిగల విద్యార్థులు వెంటనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత సైట్ లోదరఖాస్తూ చేసుకోవచ్చు. ఈ ఐటీ ఉద్యోగాలకు శిక్షణ మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు. 

 SSC Exams 2024-25 Calendar Released : SSC 2024-25 జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌.. CGL, CHSL, MTS, Constable మొద‌లైన ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

మూడు నెలలు శిక్షణతో పాటు..  స్టైపెండ్ కూడా..
అయితే ఇందులో మొదటి మూడు నెలలు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. పైగా స్టైపెండ్ కింద నెలకు రూ.10 వేలు కూడా ఇస్తారు. ఇక 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత.. HCLలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగం సాధించిన తర్వాత.. ఏటా రూ.1.7 లక్షలు నుంచి రూ.2.2 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. 

ఎంపికైనా విద్యార్థులకు..
ఈ రంగంలో ఐటీ, సర్వీస్‌ డెస్క్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ విభాగాల్లో ఐటీ సర్వీసెస్‌, అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి. కనుక ఆసక్తి ఉన్నవారు 7981834205, 9063564875, 8341405102లో సంప్రదించవచ్చని ఇంటర్‌ విద్యా శాఖ పేర్కొంది. అలాగే ప్రోగ్రామ్ కు ఎంపికైనా విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్‌, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్‌ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

TSPSC AEE Selected Candidates List Released: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

#Tags