ECIL: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. స్టైపెండ్ ఎంతంటే..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) గ్రాడ్యుయేట్, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హులైన‌ అభ్యర్థులు డిసెంబర్ 15, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 363 ఖాళీలు భర్తీ అవ్వ‌నున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై, 31-12-2023 నాటికి 25 సంవత్సరాల లోపు వ‌య‌సు ఉన్న వారు దీనికి అరుహులు. విద్యార్థులు సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఒక సంవ‌త్సరం అప్రెంటిస్ వ్య‌వ‌ది ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ శిక్షణ జ‌న‌వ‌రి 1, 2024 నుంచి ప్రారంభం అవుతుంది.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో డాక్యుమెంట్‌ల‌ వెరిఫికేషన్ ఉంటుంది.

Spot Admissions: పీజీలో ఖాళీ సీట్లను భర్తీ చేయాలి
 
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్: 250 ఖాళీలు
డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్: 113 ఖాళీలు
స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000.
 
దరఖాస్తుల‌ తేదీ.. 
ప్రారంభం: 5-12-2023.
చివరి తేదీ: 15-12-2023.
ధ్రువపత్రాల పరిశీలన: 21, 22-12-2023.
ప్రవేశానికి గడువు తేదీ: 31-12-2023.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/

#Tags