Anganwadi Jobs Notification 2024: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి,పాడేరు: జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 26 నుంచి వచ్చేనెల 10వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, స్థానికంగా నివాసం ఉండే వివాహిత ఈ పోస్టుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 21 ఏళ్ల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే ఈ నిబంధనలు వర్తిసాయని ఆయన తెలిపారు.ఖాళీ పోస్టుల వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర అర్హతలకు సంబంధంచి స్థానికంగా ఉన్న ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. మార్కులు,అర్హతలు ప్రకారం అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, అభ్యర్ధులు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ సూచించారు.

చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..

#Tags