Ola Cabs Co-Founder Ankit Bhati: ఒకే ఒక్క ఆలోచ‌న‌... ఐదేళ్ల‌కు వేల కోట్ల అధిప‌తిని చేసింది... అంకిత భాటి స‌క్సెస్ జ‌ర్నీ ఇదే

ఓలా క్యాబ్ సర్వీస్ అనగానే భవిష్ అగర్వాల్ గుర్తుకు వస్తారు. అయితే దీన్ని స్థాపించడంలో మరొక వ్యక్తి హస్తం కూడా ఉంది. అతడే ఓలా క్యాబ్ సర్వీస్ కో ఫౌండర్ 'అంకిత్ భాటి' (Ankit Bhati).
Ola Cabs Co-Founder Ankit Bhati

అతి తక్కువ వయసులోనే బిలీనియర్ అయిన అంకిత్ స‌క్సెస్ జ‌ర్నీ... 

ట్యూష‌న్లు చెప్ప‌డంతో ప్రారంభించి... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ... వేల కోట్లకు అధిపతైన‌ అలఖ్ పాండే స‌క్సెస్ జ‌ర్నీ

దేశంలో అతి పిన్న వ‌య‌సులో స‌క్సెస్ సాధించిన యువ‌త‌లో అత్య‌ధిక శాతం మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లే ఉంటున్నారు. కార్పొరేట్ కొలువుల‌కు టాటా చెప్పి సొంతంగా వ్యాపారాలు చేస్తూ స‌క్సెస్ సాధిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు అంకిత్ భాటి. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కంపెనీ స్థాపనలో పాలుపంచుకుని విజయం సాధించిన అంకిత్... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయిలో గ్రాడ్యుయేష‌న్‌ పూర్తి చేసాడు. 

మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అంకిత్ కోడింగ్‌లో కూడా మంచి ప‌ట్టు సాధించాడు. ఓలా క్యాబ్ సర్వీస్ ప్రారంభించడానికి ముందు మైక్రోసాఫ్ట్, మేక్ సెన్స్, విల్కామ్ లాంటి బ‌హుళ జాతి సంస్థలలో పనిచేశారు.

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

ఓ చిన్న ఆలోచ‌న‌తో ఓలా క్యాబ్స్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఓలా క్యాబ్స్ ఫౌండ‌ర్ల‌లో అంకిత్ భాటియా కూడా ఒక‌రు. 2010లో ప్రారంభ‌మైన ఓలా క్యాబ్స్ కేవ‌లం ఐదేళ్ల‌లోనే వేల కోట్ల షేర్ వాల్యూ సాధించింది. దీంతో భవిష్ అండ్ అంకిత్ ఇద్దరూ కూడా అతి తక్కువ కాలంలో బిలీనియర్స్ అవ‌డంతో పాట దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

ఓలా క్యాబ్స్ స్థాపించిన ఐదేళ్ల‌కు అంటే 2015 నాటికి అంకిత్ ఆస్తుల విలువ రూ. 3 వేల కోట్లు. ఒకే ఒక్క ఆలోచ‌న ఎనిమిదేళ్ల‌కు వేల కోట్ల‌కు అధిపతిని చేసింది. ప్ర‌స్తుతం ఓలా క్యాబ్స్ ఏడాదికి రూ. 938 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. దీన్ని రూ.1000 కోట్ల‌కు పెంచేందుకు అంకిత్‌, భ‌వీత్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

ప్రస్తుతం ఉబర్ కు గట్టి పోటీ ఇస్తున్న ఓలా క్యాబ్ సర్వీస్ మంచి లాభాల బాటలో పయనిస్తోంది. సంస్థ సీఈఓగా భవిష్, సిటీఓగా (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) అంకిత్ ఉన్నారు.

#Tags