Top 10 Resources: పోటీ ప‌రీక్ష‌ల‌కు ఈ పది ఫాలో అయితే... మీదే ఉద్యోగం!

కొంద‌రు ఉన్న‌తంగా చ‌దువుకొని, మంచి ఉద్యోగం సాధించి స్థిర‌ప‌డాల‌నుకుంటారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: కొంద‌రు ఉన్న‌తంగా చ‌దువుకొని, మంచి ఉద్యోగం సాధించి స్థిర‌ప‌డాల‌నుకుంటారు. వారికి ఉన్న చ‌దువుకు త‌గిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తారు. మ‌రికొంద‌రు, చ‌దివిన చ‌దువుకు ఏమాత్రం సంబంధం లేకుండా వ‌చ్చిన ఉద్యోగంతో స్థిర‌ప‌డ‌తారు. కాని, కొంద‌రు ఉన్న‌తంగా ఆలోచించి, అతి క‌ష్ట‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని పొందాల‌నుకుంటారు. ఈ ఉద్యోగం పొంద‌డం ఏమాత్రం సులువు కాదు. రాసే ఒక్క ప‌రీక్ష‌కే ఎంతో స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. అవే పోటీ ప‌రీక్ష‌లు.. 
ఇవి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉంటాయి. వీటిల్లో ఉద్యోగం పొందడం చాలా గొప్ప విష‌యం. కాని, కొంద‌రు అభ్య‌ర్థుల‌కు ఈ ప‌రీక్షలకు ఎలా సిద్ధ‌మ‌వ్వాలో అర్థం కాదు. ఎటువంటి స‌దుపాయాలు ఉండాలి, ఎలాంటి కోచింగ్ పొందాలి, ఎలా ఎంత స‌మ‌యం కేటాయించాలి.. వీట‌న్నింటికి క్రింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు ప్ర‌తీ పోటీ ప‌రీక్ష అభ్య‌ర్థికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

TGPSC Group 1 Mains : 21 నుంచి 27 వరకు గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్స్‌.. పరీక్ష రోజు అనుసరించే వ్యూహమే విజయానికి కీలకం!

పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌దుపాయాలు ఇవే..

1. ప‌రీక్ష‌కు సంబంధించిన‌ అధికారిక వెబ్‌సైట్‌లు.
2. ఆన్‌లైన్ విద్యావిధానం.
3. ప‌రీక్ష‌కు సిద్ధ‌మైయ్యేందుకు సంబంధిత యాప్‌లు.
4. యూట్యూబ్ చానల్స్‌.
5. మాక్ టెస్ట్ ప్లాట్‌ఫారమ్‌లు.
6. ప్రఖ్యాత రచయితల పుస్తకాలు.
7. గ‌తేడాదికి సంబంధించిన పుస్త‌కాలు, ప్ర‌శ్న ప‌త్రాలు, మాదిరి ప్ర‌శ్న‌లు.
8. టెలిగ్రామ్ అధ్యయన సమూహాలు, ఫోరమ్‌లు.
9. క‌రెంట్ అఫైర్స్ వెబ్‌సైట్స్, మ్యాగ‌జైన్స్‌.
10. స‌మ‌య నిర్వ‌హ‌ణ‌, అభ్య‌స‌నకు స‌రైన షెడ్యూల్.

ఇటువంటి ప‌లు స‌దుపాయాల‌ను పాటిస్తే, పోటీ ప‌రీక్ష‌లు ఏదైనా, ఉన్న‌త మార్కుల‌తో ఉద్యోగం పొంద‌వ‌చ్చు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags