JEE And NEET Free Coaching in Sathee Portal: పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి శుభవార్త.. ఉచితంగా కోచింగ్‌, వీడియో క్లాసులు

పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. జేఈఈ, నీట్‌, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు కేంద్ర​ం ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు వీలుగా సాథీ (సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ను ప్రారంభించింది.
JEE And NEET Free Coaching in Sathee Portal

ఐఐటీ కాన్పూర్‌తో కలిసి కేంద్రం ఈ సేవలు అందిస్తోంది. దీని ద్వారా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు నిపుణులతో ఉచితంగా గైడెన్స్‌ అందిస్తుంది. మాక్ టెస్టులు, వీడియో లెక్చర్స్‌ సహా వివిధ భాషల్లో వీటిని ఎన్‌సీఈఆర్‌టీ అందుబాటులోకి తెచ్చింది. జేఈఈ మెయిన్‌-2025కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం నవంబర్‌ 6 నుంచి 40 రోజుల క్రాష్‌ కోర్సును ప్రారంభించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి. 

రిజిస్ట్రేషన్‌ ఇలా చేసుకోండి..

 

  • ముందుగా సాథీ పోర్టల్‌ను సందర్శించండి
  • మీ పూర్తిపేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌తో ఒక అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోండి
  • జేఈఈ/నీట్‌/ఎస్‌ఎస్‌సీ/బ్యాంకింగ్‌/ఐసీఏఆర్‌/సీయూఈటీ ఇలా మీరు దేనికి ప్రిపేర్‌ అవ్వాలనుకుంటున్నారో ఆ వివరాలను సెలక్ట్‌ చేసుకోండి. 
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక లాగిన్‌ అయితే, లైవ్‌ సెషన్స్‌, వీడియో క్లాసులను వినొచ్చు. 

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags