Polytechnic Course: పాలిటెక్నిక్‌ కోర్సులతో ఉజ్వల భవిత.. దరఖాస్తు చేసుకోండి

తిరుపతి ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథరెడ్డి తెలిపారు.
పాలిసెట్‌పై అవగాహన కల్పిస్తున్న విశ్వనాథరెడ్డి

తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం పాఠశాలలో మార్చి 29వ తేదీ పాలిటెక్నిక్‌, ఏపీఆర్‌జేసీ అవగాహన సదస్సు, పాలిసెట్‌ నమూనా ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాలిటెక్నిక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌, కెమికల్‌, బయో మెడికల్‌, త్రీడీ యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్‌, పెట్రోలియం, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్‌), మెకానికల్‌ రిఫ్రిజరేటర్‌ అండ్‌ ఎయిడ్‌ కండిషనర్‌, డిజైన్‌ అండ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, షుగర్‌ టెక్నాలజీ వంటి డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 

పాలిటెక్నిక్‌ డిప్లొమో అనంతరం ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చన్నారు. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో లభిస్తుందని, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డిప్లొమో పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ 27వ తేదీ పాలిటెక్నిక్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక విద్యా శాఖ నిర్వహించనుందని, ఆసక్తి ఉన్న వారు ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

AP ECET 2024 Notification: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

#Tags