Engineering College: వీఆర్‌ సిద్ధార్థ కాలేజీకి తృతీయస్థానం... కార‌ణం?

జాతీయ స్థాయి ఆటోమేష‌న్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు ఓ ఇంజ‌నీరింగ్ కళాశాల విద్యార్థులు. పోటీల్లో భాగంగా మెకానిక‌ల్ విభాగంలో వారి ప్ర‌ద‌ర్శ‌ను చూప‌గా విద్యార్థులు వారి కృషికి ఫ‌లితంగా తృతియ స్థానాన్ని సాధించారు.
engineering students presenting their project at mumbai

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆటోమేషన్‌ ఎక్స్‌పోలో కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి బహుమతి గెలిచారు. గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు ముంబైలో జరిగిన జాతీయ స్థాయి ఆటోమేషన్‌ ఎక్స్‌పో –2023లో వీఆర్‌ సిద్ధార్థ కాలేజీకి చెందిన మెకానికల్‌ విభాగం విద్యార్థులు కాసింమౌల, దివ్యసింగి, ఆషిత, సురేంద్రబాబు పాల్గొని ప్రోగ్రామబుల్‌ లాజికల్‌ కంట్రోలర్‌ (పీఎల్‌సీ)ని ఉపయోగించి ఆటోమేటెడ్‌ స్పాట్‌ వెల్డింగ్‌ మెషిన్‌ అనే మోడల్‌ను ప్రదర్శించారు.

Teacher Contribution: విద్యార్థుల‌కు త‌మ 25ఏళ్ళ శిక్ష‌ణ‌

100కు పైగా పాల్గొన్న ఎక్స్‌పోలో వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ విద్యార్థులు వారు ప్రదర్శించిన మోడల్‌కు తృతీయస్థానం పొంది బహుమతిని గెలుచుకున్నారు. మెకానికల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఢిల్లీబాబు మార్గదర్శిగా వ్యవహరించారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతి గెలవడంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏవీ రత్నప్రసాద్‌, విభాగాధిపతి ఎన్‌.విజయసాయి విద్యార్థులను అభినందించారు.

#Tags