Top IITs and NITs in India : దేశంలోని టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో వరుసగా ఐదో ఏడాదీ తొలి స్థానంలోనే నిలిచించింది ఐఐటీ మద్రాస్.

అలాగే ఐఐటీ దిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యాసంస్థల్లో అంతర్జాతీయంగా టాప్‌ 50లో ఒకటిగా సత్తా చాటింది. ఇక ఐఐటీ బాంబే   NIRF ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఐఐటీ కాన్పూర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఖరగ్‌పుర్‌ (ఐదు), ఐఐటీ రూర్కీ(ఆరు), ఐఐటీ గువాహటి (ఏడు), ఐఐటీ హైదరాబాద్‌ (8) నిలిచాయి. ఎన్‌ఐటీ తిరుచ్చి తొమ్మిదో ర్యాంకు, ఎన్‌ఐటీ కర్ణాటక (12), ఎన్‌ఐటీ రౌర్కెలా (16), ఎన్‌ఐటీ వరంగల్‌ (21),  ఎన్‌ఐటీ కాలికట్‌ 23వ ర్యాంకుల్లో మెరిశాయి.

 >> College Predictor - 2024 (AP&TG - EAPCET, POLYCET and ICET) - Click Here

☛ JEE Advanced Results 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! 'కీ' కూడా...

గ్లోబల్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో..

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2024 జాబితాలోనూ ఐఐటీ బాంబే చోటు దక్కించుకోగా.. గ్లోబల్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ కాన్పూర్‌ 93వ ర్యాంకులో నిలిచింది.

☛ JEE Mains 1st Ranker Nilkrishna Success Story : అదో మారుమూల గ్రామం.. ఓ సాధార‌ణ రైతు బిడ్డ.. నెం-1 ర్యాంక్ కొట్టాడిలా.. కానీ..

#Tags