Top 10 Engineering Colleges in India : దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. వీటిలో చదివారంటే లక్షల్లో ప్యాకేజీలు
దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF)-2024ని విడుదల చేసింది. ఈ మేరకు 100% క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ 2024లో అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలో ఐఐటీ మద్రాస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఆరోసారి కూడా ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు టాపర్స్ ఛాయిస్‌లో IIT మద్రాస్ తొలిస్థానంలో ఉంటుందన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది టాప్-10 ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలో ఐఐటీ బాంబే రెండో స్థానంలో ఉంది. దాని తర్వాత ఐఐటీ కాన్పూర్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో పాటు టాప్-10లో చోటు దక్కించుకున్న కాలేజీల లిస్ట్‌ను చూసేద్దాం.
టాప్ 10 ఇంజనీరింగ్ విద్యాసంస్థలు ఇవే
- ఐఐటీ మద్రాస్
- ఐఐటీ ఢిల్లీ
- ఐఐటీ బాంబే
- ఐఐటీ కాన్పూర్
- ఐఐటీ ఖరగ్ పూర్
- ఐఐటీ రూర్కీ
- ఐఐటీ గువహటి
- ఐఐటీ హైదరాబాద్
- ఎన్ ఐటీ తిరుచ్చిరాపల్లి
- ఐఐటీ,వారణాసి
#Tags