Student Success: క‌ళాశాల నుంచి యూనివ‌ర్సిటీలోకి సీటు సాధించిన విద్యార్థిని

ప్ర‌భుత్వ కాలేజీలో చ‌దువుతున్న ఈ విద్యార్థిని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించి, యూనివ‌ర్సిటీలో సీటు ద‌క్కించుకుంది. త‌న విజ‌యం చ‌రిత్ర సృష్టించింది.
Government college student achieves seat in HCU

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాలలో బీఏ పూర్తి చేసిన ముండేరు మాతాయి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సీటు సాధించింది. పీజీ ప్రవేశ పరీక్ష చరిత్ర విభాగంలో ఓబీసీ కేటగిరీలో జాతీయస్థాయిలో 9వ ర్యాంకు సాధించి తెలంగాణలో అత్యున్నత కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హెచ్‌సీయులో సీటు దక్కించుకుంది. కళాశాల నుంచి హెచ్‌సీయూలో సీటు పొందిన తొలి విద్యార్థినిగా ఆమె చరిత్ర సృష్టించారు.

Awarding Poet: ప్ర‌ముఖ క‌వి పొందిన జాతీయ పుర‌స్కారం

ఇదే స్ఫూర్తితో చరిత్రను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకుని సివిల్స్‌ సాధిస్తానని సదరు విద్యార్థిని ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రూమాతాయితోపాటు చరిత్ర అధ్యాపకులు పృథ్వీరాజ్‌, శంకర్‌ను ప్రిన్సిపాల్‌ జలగం అనిత అభినందించారు.
 

#Tags