Spot admissions: నేటి నుంచి యూనివర్సిటీలో స్పాట్‌ అడ్మిషన్లు

Spot admissions

కర్నూలు కల్చరల్‌: డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద పరిమిత సంఖ్యలో మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.లోకనాథ తెలిపారు.

ఇకనుంచి ఇంటర్‌ పరీక్షల్లో కొత్త మార్పులు: Click Here

పీజీ కోర్సుల్లో ఎంఏ ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, ఉర్దూ, ఎమ్మెస్సీ జువాలజీ, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో స్పాట్‌ అడ్మిషన్ల కింద చేర్చుకునేందుకు ప్రభుత్వ అనుమితి ఇచ్చిందని పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వర్సిటీ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు.

హాస్టళ్లలో వసతి సదుపాయం
ఉన్నత విద్యా మండలి నిబంధనల ప్రకారం అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. అమ్మాయిలకు యూనివర్సిటీలో హాస్టల్‌ వసతి, అబ్బాయిలకు నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 83415 11632, 99597 58609ను సంప్రదించాలన్నారు.

#Tags