Academic Year Admissions: ఐఎంయూలో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులు..

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ దరఖాస్తులు ఆహ్వానం..

సాక్షి ఎడ్యుకేషన్‌: చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్శిటీ(ఐఎంయూ)..  2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

»    విభాగాలు: మెరైన్‌ ఇంజనీరింగ్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజనీరింగ్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్, నాటికల్‌ సైన్స్, అప్లైడ్‌ న్యూట్రికల్‌ సైన్స్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజనీరింగ్, డ్రెడ్జింగ్‌ హార్బర్‌ ఇంజనీరింగ్, మెరైన్‌ టెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌.
»    అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్‌/సీయూఈటీ/పీజీ సెట్‌/క్యాట్‌/మ్యాట్‌/సీమ్యాట్‌ స్కోరు ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 
05.05.2024
»    ఐఎంయూ సెట్‌ పరీక్ష తేది: 08.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.imu.edu.in

#Tags