Nannaya University: న్యూయోమ్ టెక్నాలజీస్ సంస్థతో నన్నయ యూనివర్సిటీ సమావేశం!
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ అభివృద్ధికి న్యూయోమ్ టెక్నాలజీస్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమని వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. బెంగళూరులోని ఆ సంస్థ సీఈఓ కమ్ ఎండీ డాక్టర్ వంగల రజనీకాంత్‌తో యూనివర్సిటీ అధికారులు ఈసీ హాలులో శుక్రవారం సమావేశమై ప్రస్తుతం కల్పించవలసిన మౌలిక సదుపాయాలపై చర్చించారు.
Indian Students: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. భారతీయ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక
విద్యార్థుల అభ్యసన, వ్యవస్థాపకత, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణల కోసం ఆ సంస్థతో కలిసి పని చేయనున్నామని వీసీ తెలిపారు. డాక్టర్ వంగల గోదావరి జిల్లాల వాసీ కావడంతో ప్రాంతీయ అభిమానంతో ఈ విధంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రిజిస్టార్ ఆచార్య జి. సుధాకర్, ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Private Unaided Schools: విద్యా హక్కు చట్టంతో ఉచిత విద్య.. దరఖాస్తులకు చివరి తేదీ!