Inspection by NAAC: డిగ్రీ కళాశాలకు న్యాక్‌ సందర్శన..

కళాశాలను, విద్యార్థులకు అందే వసతుల గురించి పరిశీలించడానికి మహిళ డిగ్రీ కళాశాలకు సందర్శించారు న్యాక్‌ బృందం. ఈ సందర్భంగా వారు రెండురోజులపాటు పరిశీలించారు..

పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని నాక్‌ బృందం మంగళవారం పరిశీలించింది. బృందంలో మహర్షి దయానంద విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్‌ సంతోష్‌ నందాత్‌, ఉత్తరాఖాండ్‌లోని గర్వాల్‌ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్‌ శివకుమార్‌ గుప్తా, రాంచీ విశ్వవిద్యాలయం నుంచి బ్రజ్‌ క్రిశోర్‌ సింహా ఉన్నారు.

Science Lab: పాఠశాలలో మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన కలెక్టర్‌..

రెండు రోజులు పాటు కళాశాలలోని వివిధ విభాగాలు, బోధనా పద్ధతులు, పరిశోధన అంశాలు, సేవా కార్యక్రమాలు, ప్రయోగశాలలు తదితర అంశాలను పరిశీలించి కళాశాలకు గ్రేడ్‌ను నిర్ణయించనున్నట్లు ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రమణమ్మ తెలిపారు. తొలిరోజు పర్యటనలో భాగంగా బృంద సభ్యులు కళాశాలలోని విద్యార్థినులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యక్రమానికి కళాశాల జోన్‌–3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వీఆర్‌ జ్యోత్స్నకుమారి హాజరయ్యారు. అనంతరం విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

#Tags