Skip to main content

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

వనపర్తి: ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, ఉదయం 9 గంటలకు పాఠశాలలకు చేరుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.
Teachers should be punctual

ఆగ‌స్టు 18న‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో రెండోజత యూనిఫామ్స్‌ ఇవ్వలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆగ‌స్టు 19న‌ సాయంత్రంలోపు అందజేయాలని కోరారు.

చదవండి: School Education Department: పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని.. విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగాలని.. అందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. ఇచ్చిన సూచనలు నేటి నుంచి అమలు చేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 19 Aug 2024 01:35PM

Photo Stories