Mera Yuva Bharat: నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు

ఏటూరునాగారం: నేటి విద్యార్థులే రేపటి భావి భారత పారిశ్రామికవేత్తలని జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్‌ డైరెక్టర్‌ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.

మండల కేంద్రంలోని ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్‌ బోర్డు కామర్స్‌, ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.చిన్న అధ్యక్షతన మార్చి 14వ తేదీ మేరా యువభారత్‌ సుగంధ ఉద్యోగ మంథన్‌ ఒకరోజు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత పారిశ్రామిక రంగం వైపు ప్రయాణించి తయారీ, సేవా, వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టించాలన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా స్పైసెస్‌ బోర్డు ఆధ్వర్యంలో మేరా యువభారత్‌ కార్యక్రమాన్ని ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారత ప్రభుత్వం సూక్ష్మ, లఘు పరిశ్రమల శాఖ నుంచి ములుగు జిల్లాలో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని మంజూరు చేయించి స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించి మంజూరుకు పంపినట్లు వెల్లడించారు. 

Current Affairs 2024: మార్చి 15వ తేదీ కరెంట్ అఫైర్స్.. క్లుప్తంగా మీ కోసం..

అనంతరం స్పైసెస్‌ బోర్డు వరంగల్‌ రీజనల్‌ కార్యాలయం సహాయ సంచాలకురాలు విజ్జిస్ట్న మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులు, వ్యాపారులకు అందిస్తున్న పథకాలను వివరించారు. యువత ఎగుమతి దారులుగా కావడానికి అవసరమైన యువ పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులందరికీ స్పైసెస్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ సురేష్‌, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ ఎండి అబ్దుల్‌ రెహమాన్‌, జిల్లా ఆహార శుద్ధి పరిశ్రమల రీసోర్స్‌ పర్సన్‌ శ్రీకాంత్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ములుగు మేనేజర్‌ జనార్ధన్‌, ఏటూరునాగారం ఎస్‌బీఐ మేనేజర్‌ భిక్షపతి, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.రవీందర్‌, కళాశాల అధ్యాపకులు స్వామి, రేణుక, విజయలక్ష్మీ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags