Skip to main content

Onion Exports: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం!

దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Export policy update  Indian Government Lifts Ban on Onion Exports  Union Commerce and Industry Department announcement

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.

ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4వ తేదీ నాటి నోటిఫికేషన్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3వ తేదీ నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.

Onion Export: ఈ ఆరు దేశాలకు భారత్ ఉల్లిపాయల ఎగుమతి ప్రారంభం.. ఏ దేశాల‌కంటే..

ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేం‍ద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.

2023 డిసెంబర్‌లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26వ తేదీ, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Bird Flu: బర్డ్ ఫ్లూ కేసులు నమోదు.. అప్రమత్తంగా ఉండండి.. జాగ్రత్తలు తీసుకోండి!

Published date : 04 May 2024 05:24PM

Photo Stories