Ambedkar Gurukulam : అంబేడ్కర్‌ గురుకులంలో 19 మందికి మెడిసిన్‌ సీట్లు

Ambedkar Gurukulam : అంబేడ్కర్‌ గురుకులంలో 19 మందికి మెడిసిన్‌ సీట్లు

కర్నూలు: జిల్లాలోని చిన్నటేకూరు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ, మెడికల్‌ అకాడమీకి చెందిన 19 మంది విద్యార్థులు మెడిసిన్‌ సీట్లు సాధించారని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ఐ ఉమ్మడి కర్నూలు జిల్లా సమన్వయకర్త డా.ఐ శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరందరికి రాష్ట్రంలోని వివిధ మెడికల్‌ కళాశాలల్లో సీట్లు అలాట్‌ అయ్యాయన్నారు. అలాగే ఇంజినీరింగ్‌కు సంబంధించి ఐఐటీకి 08, ఎన్‌ఐటీకి 25, సీయూ సీఈటీకి 07, ఐఐఐటీకి 01 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. రాష్ట్రంలోని అడవి టెక్కలపాడు, ఇడుపుగల్లు అకాడమీలతో పోల్చుకుంటే చిన్నటేకూరు విద్యార్థులు అధిక సంఖ్యలో మెడిసిన్‌ సీట్లు సాధించారన్నారు. అలాగే ఐఐటీ, ఎన్‌ఐటీలో కూడా తమ అకాడమీ విద్యార్థులే టాప్‌లో ఉన్నారన్నారు. ఈ స్థాయిలో సీట్లు రావడానికి అధ్యాపకుల కృషి ఎంతో ఉందన్నారు.

Also Read: Mahindra Company Scholarship

మెడికల్‌ సీట్లు సాధించిన విద్యార్థులు వీరే

పోలా మనోజ్‌కుమార్‌ కర్నూలు మెడికల్‌ కళాశాల, బుద్దగారి అబ్రహామ్‌, పగడాల పౌల్‌ అరుణ్‌కుమార్‌ అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, పులుగు దినేష్‌, వడితే త్రినాథ్‌నాయక్‌ ,కాకినాడ రంగరాయ, మహమ్మద్‌ రషీద్‌ విజయవాడ ప్రభుత్వ సిద్దార్థ, మాసపోగు అద్విత్‌ సంగీతరావు, మల్లెపోగు అద్భుత కుమార్‌, మంచాల సునీల్‌కుమార్‌ కడప ప్రభుత్వ మెడికల్‌ కాలేజి, మాసపోగు శ్రీధర్‌ నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నేనావత్‌ మల్లేష్‌నాయక్‌ రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సాకే కిషోర్‌ నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజ్‌, పిడుగు రంజిత్‌కుమార్‌, బానోత్‌ మహేంద్రనాయక్‌,కుప్పం, పసుపులేటి రాజ, కొమ్మతోటి రాహుల్‌,విజయనగరం, పి చరణ్‌తేజ, ఎం ఉమేష్‌కుమార్‌,కర్నూలు విశ్వభారతి, వాకిటి సుభాష్‌ తిరుపతి శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు సాధించినట్లు డీసీఓ వెల్లడించారు.

#Tags