Skip to main content

Admissions In Paramedical Course 2024: పారామెడికల్‌ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్‌

Admissions In Paramedical Course 2024: పారామెడికల్‌ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్‌
Admissions In Paramedical Course 2024: పారామెడికల్‌ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్‌

కర్నూలు: కర్నూలు మెడికల్‌ కాలేజిలో పారామెడికల్‌ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్‌ ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లను కౌన్సిలింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. చిట్టినరసమ్మ మాట్లాడుతూ పారామెడికల్‌ కోర్సుల్లో మిగిలిన సీట్లకు సంబంధించి మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం భర్తీ చేశామన్నారు. దాదాపు అన్ని సీట్లు పూర్తయ్యాయని తెలిపారు. దీంతో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యిందన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఏ కారణం చేతనైనా ఫీజు చెల్లించకపోతే సదరు సీట్లను వచ్చే నెలలో జరిగే రెండో విడత కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. కౌన్సిలింగ్‌ కమిటీలో వైస్‌ ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ డాక్టర్‌ పి. హరిచరణ్‌, డాక్టర్‌ టి. సాయిసుధీర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌. అనిల్‌కుమార్‌రెడ్డి, ఏఓ ఎస్‌. లక్ష్మీప్రసన్న ఉన్నారు.

Also Read:  Telangana Health Department Recruitment 2024

Published date : 19 Sep 2024 10:09AM

Photo Stories