IIIT Collaborative with University of Tokyo: టోక్యో విశ్వవిద్యాలయంతో ట్రిపుల్‌ఐటీ సహకార అధ్యయనం

సాక్షి ఎడ్యుకేష‌న్ : కౌన్సిల్‌ ఆఫ్‌ కౌన్సిల్‌ షిబౌరా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ టోక్యోతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్‌ మురళీధర్‌ మిర్యాల ట్రిపుల్‌ఐటీలో అధ్యాపకులకు విద్య, పరిశోధన పరంగా ఎటువంటి అవకాశాలు ఉంటాయో సహకార అధ్యయనం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు.
IIIT Collaborative Study with University of Tokyo

ట్రిపుల్‌ఐటీ, టోక్యో విశ్వవిద్యాలయం సహకార అధ్యయనంతో ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న విద్యార్థులు వారం నుంచి మూడు వారాల వరకు ఆ దేశంలో చదువుకునే అవకాశాలు ఉంటాయన్నారు. 

టోక్యో విశ్వవిద్యాలయాల్లో ప్రయోగశాలలు, నూత న కోర్సులు ఇతర అంశాలపై సాంకేతికతను జోడించడం వంటి కార్యక్రమాలను తెలుసుకోవచ్చని సూచించారు. వీసీ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రొఫెసర్‌ మురళీధర్‌ వెల్లడించారు.

#Tags