Freshers Day: న్యాయ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌ డేలో భాగంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రజిని పాల్గొని విద్యార్థులను ప్రోత్సాహించారు. ఈ రంగంలో ఉన్న వారికి ఉన్న, ఉండే అవకాశాల గురించి వివరించారు..

ఎచ్చెర్ల క్యాంపస్‌: విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజిని అన్నారు. వర్సిటీలోని మహాత్మా జ్యోతిరావు పూలే న్యాయ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీసీ మాట్లాడుతూ న్యాయ విద్య పూర్తయిన తర్వాత సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.

Sports Month: విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ ప్రారంభం.. తేదీ..?

న్యాయవాదిగా, న్యాయ శాఖ అధికారిగా, సమాజంలో గుర్తింపు లభించే ఇతర వృత్తుల్లో సైతం రాణించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్‌ పి.సుజాత, కోర్సు కోఆర్డినేటర్‌ వై.రాజేంద్రప్రసాద్‌, న్యాయ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జేకే ఎల్‌.సుజాత, జి.జయలక్ష్మి, టాంకాల బాలకృష్ణ, చిన్నారావు, మన్మధరావు పాల్గొన్నారు.

Student Deepika: రాష్ట్ర స్థాయిలో విద్యా‍ర్థినికి ప్రథమ స్థానం

#Tags