Dasara Holidays for Colleges 2024 : కాలేజీలకు దసరా సెలవులు ప్రకటన... మొత్తం ఎన్ని రోజులంటే...?
అయితే తెలంగాణలో మాత్రం ఇంటర్ కాలేజీలకు దసరా పండగ సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. అలాగే అత్యంత తక్కువ రోజులను మాత్రమే ఈ సారి ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 6వ తేదీ నుంచి..
తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 6వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే స్కూల్స్‌కు చాలా రోజులు సెలవులు ఇచ్చి.. ఇంటర్ కాలేజీలకు మాత్రం తక్కువ రోజులు ఇవ్వడంపై పలు లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణలో బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని.., అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
☛➤ October 10th Holiday 2024 : అక్టోబర్ 10వ తేదీన సెలవు.. ఇవ్వాల్సిందే.. ఎందుకంటే..?
ఏపీలో మాత్రం కాలేజీలకు...
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్కూళ్లకు, కాలేజీలకు అక్టోబర్ 3వ తేదీ నుంచి హాలిడేస్ రానున్నాయి. గాంధీ జయంతి కావడంతో అక్టోబర్ 2వ తేదీన కూడా సెలవు ఇచ్చారు. అయితే ఏపీలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే... అక్టోబర్ 3వ తేదీన నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవులు ఇచ్చినా.., ప్రైవేట్ కాలేజీలకు 3, 4, 5 తేదీల్లో క్లాసులు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య తేడా ఎందుకుని, అక్టోబర్ 2 నుంచే సెలవులు ఇవ్వాలని లెక్చరర్ల సంఘాలు, విద్యార్థులు. వీరి తల్లిదండ్రులు కోరుతున్నారు.
☛➤ Dussehra Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఒకరోజు అధికంగా..
2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవులు ఇవే..
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు