Counselling for Pharmacy Courses: ఫార్మ‌సీ కోర్సుల ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌..

ఫార్మ‌సీ కోర్సుల‌కు విద్యాశాఖ షెడ్యూల్ విడుద‌ల చేసింది. విద్యార్థులు ప్ర‌క‌టించిన తేదీ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అలాగే, కౌన్సెలింగ్ కు కూడా హాజ‌రు కావాల‌ని తెలిపారు..
Admissions and counselling details released for Pharmacy courses

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్‌–2023) ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌ల వారీగా ఒకేసారి కౌన్సెలింగ్‌ నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాచరణ రూపొందించింది.

➤   Sports: స్కేటింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ ఫార్మసీ, ఫార్మాడీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీటెక్‌లలో బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు చర్యలు చేపట్టింది. ఏపీ ఈఏపీ సెట్‌–2023లో అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు కౌన్సెలింగ్‌ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది.

● ఫీజు చెల్లించిన వెంటనే విద్యార్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ ఐడీ, లాగిన్‌ ఐడీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా వస్తాయి. ఈ విధంగా సందేశం వస్తే విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లే. అనంతరం కళాశాలలను ఎంపికకు ఎంపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు ఈనెల 10,11,12 తేదీలు, బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు 11,12,13వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఒకవేళ ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉంటే ఆ వివరాలు లాగిన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే అవుతాయి. కాంటాక్ట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ (హెచ్‌ఎల్‌సీ) అని చూపిస్తుంది.

➤   Sakshi Spell Bee: స్పెల్‌బీపై ఆసక్తితో..

అప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ధ్రువపరచాల్సిన పత్రాల వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వాటిని అప్‌లోడ్‌ చేసిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే సంబంధిత హెల్ప్‌లైన్‌ కేంద్రం నుంచి ఆమోదం పొందుతాయి. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

➤   Intermediate Exam Fees Schedule: ఫీజు షెడ్యుల్ ను విడుద‌ల చేసిన ఇంట‌ర్మీడియెట్ బోర్డు

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు

విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజును ఎస్‌ఈటీఎస్‌.ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యి క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్‌ డీటెయిల్డ్‌ నోటిఫికేషన్‌, యూజర్‌ మాన్యువల్‌, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్‌లో పొందుపర్చారు.

#Tags