University Grants Commission News: యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!

University Grants Commission News: యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!

దేశంలో ప్రైవేట్‌ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. ఫీజు రిడ్రెసల్‌ ద్వారా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతటితో వదిలేయకుండా వేగంగా ఆ ఫిర్యాదులను పరిష్కరిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు అదనపు ఫీజులను రీఫండ్‌ చేయిస్తోంది. గత ఐదు విద్యా సంవత్సరాల్లో 4,257 ఫిర్యాదులు నమోదవ్వగా.. యూజీసీ ఆయా వర్సిటీల నుంచి రూ.25.51 కోట్ల సొమ్మును విద్యార్థులకు వాపస్‌ చేయించింది.  

97% సక్సెస్‌ రేట్‌..
యూజీసీ ఫీజు రిడ్రెసల్‌ సెల్‌.. ఈ–సమాధాన్‌ ప్లాట్‌ఫాం కింద పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2021–22లో 915, 2022–23లో 927, 2023–­24లో 2,251 ఫిర్యా­దులు వచ్చాయని యూజీసీ వర్గా­లు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్‌ యూని­వర్సిటీల పైనే విద్యార్థుల నుంచి అత్యధిక ఫిర్యా­దులు వచ్చాయని వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి: APPSC Jobs Notifications 2025 : 5500 పోస్టులకు పైగా నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే..?


ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, రాజస్థాన్‌ నిలిచాయని పేర్కొన్నాయి. తమకు వచి్చన ఫిర్యాదుల్లో 97 శాతానికి పైగా పరిష్కరించినట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌ చెప్పారు. మొత్తం రూ.26.30 కోట్ల విలువైన ఫిర్యాదులకు గానూ రూ.25.51 కోట్లను విద్యార్థులకు వాపస్‌ చేయించినట్లు వెల్లడించారు. ఇందులో 1,386 మంది విద్యారి్థనులకు రూ.8.71 కోట్ల ఫీజు రీఫండ్‌ చేసినట్లు తెలిపారు.

 

#Tags