Bio Medical Course: కొత్తగా బయో మెడికల్‌ కోర్సు.. ఇన్ని సీట్లు మాత్రమే..

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్‌ కోర్సు ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే అందుబాటులోకి రానుంది.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించిన కసరత్తు చేస్తోంది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు బోధన ప్రణాళిక, క్లాసుల నిర్వహణ, కార్పొరేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యంపై ఉన్నతా దికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు.

ముందుగా ప్రయోగాత్మకంగా స్వయంప్రతిపత్తి గల యూనివర్సిటీల పరిధిలో (అటానమస్‌) దీని ని అందుబాటులోకి తేనున్నారు. 150 సీట్లు మాత్రమే తొలిఏడాది భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లు గుర్తించి, అవసరమైతే మార్పులతో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.

చదవండి: New Medical Colleges: కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు.. అనుమతుల ప్రక్రియ ఇలా..

బయో మెడికల్‌కు డిమాండ్‌

కార్పొరేట్‌ వైద్యరంగంలో బయో మెడికల్‌ సేవల కు మంచి డిమాండ్‌ ఉందని గుర్తించారు. కార్పొ రేట్‌ ఆస్పత్రు ల్లో సాంకేతిక వైద్య సేవల్లో మంచి ఉపాధి అవకా శాలున్నాయి. డిమాండ్‌ తగ్గట్టుగా నిపుణుల కొరత ఉంది. దీనిని భర్తీ చేయడానికి డిగ్రీ స్థాయిలోనే బయో మెడికల్‌ సబ్జెక్టును తీసుకు రానున్నారు.

సిరాలజీ, బయాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, డీఎన్‌ ఏ, ఫిజియోథెరపీ సహా వైద్య సంబంధమైన అనేక సబ్జెక్టులతో ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ కోర్సును ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు కూడా అనుబంధ కోర్సు గా చేసే అవకాశం కల్పించాలని ఆలోచనలో ఉన్న ట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.
చదవండి: Telangana Govt Jobs: జూన్‌లో జాబ్‌ల జాతర.. ఈసారి అన్ని నియామకాలు ఈ బోర్డు ద్వారానే...

#Tags