Free Training: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి(మంథని): సింగరేణి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో నిర్వహించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఏ, ఆర్జీ–3 ఇన్‌చార్జి జీఎంలు కె.వెంకటేశ్వర్లు, ఎన్‌.రాధాకృష్ణ పేర్కొన్నారు.

కాస్మోటాలజీ (మహిళలు), డ్రోన్‌ టెక్నీషియన్‌, సోలార్‌ టెక్నీషియన్‌, సెల్‌ టెక్నీషియన్‌, టూవీలర్‌ మెకానిక్‌, ఆర్క్‌ అండ్‌ గ్యాస్‌ వెల్డింగ్‌, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోర్సులపై శిక్షణ ఉంటుదని తెలిపారు. కాస్మోటాలజీ కోర్సుకు ఎలాంటి విద్యార్హత లేదని, ఇతర కోర్సులకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

చదవండి: Special Education Teacher Valli Sudheer- వల్లీ టీచర్‌... వెరీ స్పెషల్‌, ఆ పిల్లల కోసం జీవితాన్నే అంకితం చేసింది

ఒక్కో బ్యాచ్‌కు 20 మందికి శిక్షణ ఇస్తారని తెలిపారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, భూపాల్‌పల్లి జిల్లాల్లోని సింగరేణి ప్రాంతాల 18 నుంచి 42 ఏళ్ల యువతి, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సీసీఎల్‌మైన్స్‌.కామ్‌/అప్రెంటిషిప్‌లో నమోదు చేసుకోవాలని లేదా మందమర్రి ఎంవీటీసీలో నేరుగా దరఖాస్తులు అందజేయాలకని సూచించారు.

#Tags