జర్మనీలో నర్సులుగా ఉద్యోగావకాశాలు

రాజమహేంద్రవరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), టీకేఏటీ ఇంటర్నేషనల్‌, ఏపీఎన్‌ఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్‌ చదువుకున్న అభ్యర్థులకు జర్మనీలో స్టాఫ్‌నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలిపారు.
జర్మనీలో నర్సులుగా ఉద్యోగావకాశాలు

20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు, సాధారణ ఆసుపత్రులలో రెండేళ్లలో అనుభవం, జర్మన్‌ భాష నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలన్నారు. తప్పనిసరిగా నర్సింగ్‌ గ్రాడ్యూయేట్‌(బీఎస్సీ నర్సింగ్‌) అయి ఉండాలన్నారు. విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించే బీ1 స్థాయి జర్మన్‌ భాష శిక్షణ కోసం నిర్బంధ ఉచిత ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలన్నారు. బీ1 స్థాయి ఉత్తీర్ణత సాధించిన తర్వాత జర్మనీలో పనిచేయడానికి ఆఫర్‌ లెటర్‌ ఇస్తారన్నారు. రెజ్యూమ్‌తో పాటు ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు, అనుభవ ధ్రువీకరణ పత్రం ఉండాలన్నారు.

చదవండి:

TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే

Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?

NCERT: 8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

జర్మనీకి విమాన చార్జీలతో పాటు ఉచిత ఆహారం, వసతి, మొదటి ఆరునెలల వరకూ ప్రారంభ జీతం నెలకు 1000 యూరోలు (రూ.89 వేలు) ఇస్తారన్నారు. ఆరు నెలల పాటు జర్మనీలో బీ2 సర్టిఫికేషన్‌ కోసం శిక్షణ ఇస్తారన్నారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే నెలకు జీతం దాదాపుగా రూ.2500 యూరోలు వరకూ పెరుగుతుందన్నారు. కేఎల్‌ విశ్వవిద్యాలయంలో శిక్షణ తరగతులు జూలై ఒకటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. శుక్రవారం లోపు రిజిస్ట్రేషన్‌కు చేసుకోవాలన్నారు. www.aprrdc.i n/home/onlinepsoframrefirtrationలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రెజ్యూమ్‌ని helpline@apssdc.in మెయిల్‌ ఐడి లేదా కాల్‌సెంటర్‌ 99888 53335 నంబర్‌కు షేర్‌ చేయవచ్చని తెలిపారు.

#Tags