ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..
లాం, గుంటూరు, వెంకట్రామన్నగూడెం, తిరుపతి, పెద్దాపురం, కొవ్వూరుల్లోని ఉద్యాన పరిశోధనస్థానాలు ఈ వంగడాలను రూపొందించాయి. వ్యవసాయ, సహకారశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉద్యానవర్సిటీ ఉపకులపతి టి.జానకీరామ్ తదితరులు స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీలో గతంలో వంగడాల విడుదలను ఆమోదించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ 1251 ద్వారా వీటిని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఉద్యానవర్సిటీ అధికారులు అక్టోబర్ విలేకరులకు తెలిపారు.
చదవండి: తొలిసారిగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్లు షురూ!
ఆ వంగడాలు ఇవే..
మిరపలో డాక్టర్ వైఎస్సార్హెచ్యు–క్రాంతి (ఎల్సీఏ–657), డాక్టర్ వైఎస్సార్హెచ్యు–చైత్ర (ఎల్సీఏ–680) డాక్టర్ వైఎస్సార్ హెచ్యు–తన్వి (ఎల్సీఏ–684), పచ్చి మిరపలో డాక్టర్ వైఎస్సార్హెచ్యు–సిరి (ఎల్సీఏ–616) రకాలను గుంటూరు లాం ఉద్యాన పరిశోధనస్థానం అభివృద్ధి చేసింది. తోటకూరలో డాక్టర్ వైఎస్సార్హెచ్యు–వర్ణ (విఆర్ఏ–1), చిక్కుడులో డాక్టర్ వైఎస్సార్హెచ్యు–శ్రేష్ట (విఆర్డీఎల్–1) రకాలను వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధన స్థానం, నిమ్మను తిరుపతికి చెందిన చీని నిమ్మ పరిశోధనస్థానం, పెండలం, కర్రపెండలం రకాలను కొవ్వూరు పరిశోధన స్థానం, చిలగడదుంపను పెద్దాపురం ఉద్యాన పరిశోధనస్థానం అభివృద్ధి చేశాయి.
చదవండి: వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రకటన
కొత్త వంగడాలు ప్రత్యేకం
ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్తగా విడుదల చేసిన వంగడాల రకాలు వేటికవే ప్రత్యేకమైనవి. మిరపలో జెమిని వైరస్ను తట్టుకోగల రకాలు, అధిక దిగుబడిని ఇచ్చే చిక్కుడు, తోటకూర, పెండలం రకాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తల ద్వారా ఈ రకాలకు ప్రాచుర్యం కల్పిస్తాం. – డాక్టర్ టి.జానకీరామ్, ఉద్యాన వర్సిటీ వీసీ, వెంకట్రామన్నగూడెం