Regularise KGBV Teachers: ‘కేజీబీవీల మహిళా టీచర్లను రెగ్యులర్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: కేజీబీవీ మహిళా ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులర్ చేసి, మినిమమ్ టైం స్కేల్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్.. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు టెట్ మినహాయింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధి సూరం విష్ణువర్ధన్‌రెడ్డి, సహాధ్యక్షురాలు బెండి ఉష, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులున్నారు.
చదవండి: DSC 2024 Selected Candidates: కొత్త టీచర్లలో గుబులు!.. ధ్రువీకరణపత్రాల పునఃపరిశీలన..
#Tags