BDS Admissions: బీడీఎస్‌ కన్వినర్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌.. వెబ్‌ ఆప్షన్లు నమోదుకు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్‌ కోర్సుల్లో (బీడీఎస్‌) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) శనివారం విడుదల చేసింది.

వెబ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబ‌ర్ 29వ తేదీ ఉదయం 6గంటల నుంచి అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ వెల్లడించింది.  

చదవండి: Nursing Course : నర్సింగ్‌లో విస్తృత కెరీర్‌ అవకాశాలు.. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశం

https://tsmedadm.tsche.in  వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్‌ ఫీజు కూడా చెల్లించాలి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్‌ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

#Tags