Inter Exams 2024 : ప్లస్‌– 2 పబ్లిక్‌ పరీక్షలకు హాల్‌ టిక్కెట్ల పంపిణీ

Inter Exams 2024 : ప్లస్‌– 2 పబ్లిక్‌ పరీక్షలకు హాల్‌ టిక్కెట్ల పంపిణీ

తిరువొత్తియూరు: మార్చి 1న ప్రారంభమయ్యే ప్లస్‌– 2 పబ్లిక్‌ పరీక్షలకు హాల్‌ టికెట్లను మంగళవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలిరోజు తమిళ భాష సబ్జెక్టు, 5న ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, మార్చి 8న వివిధ సబ్జెక్టు పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 11న కెమిస్ట్రీ, అకౌంటింగ్‌ తదితర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న కంప్యూటర్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులు, 19న మ్యాథమెటిక్స్‌, జువాలజీ, కామర్స్‌, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, టెక్స్‌టైల్‌ – డ్రెస్‌ డిజైనింగ్‌ సబ్జెక్టులకు, చివరి రోజైన 22న జీవశాస్త్రం, బోటనీ, హిస్టరీ, బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టులకు పరీక్షలుంటాయన్నారు.

Also Read : All Subjects Study Material

ఈమేరకు మంగళవారం హాల్‌ టికెట్‌ విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు www.dfe.in.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ప్రధానోపాధ్యాయులు తమకు అందించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వాలన్నారు. కాగా హయ్యర్‌ సెకండరీ మొదటి, రెండవ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే వ్యక్తిగత విభాగం అభ్యర్థులకు రెండు పరీక్షలకు ఒకే హాల్‌ టికెట్‌ను విద్యాశాఖ జారీ చేసింది.

#Tags