విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఈ పాఠశాలలు: సీఎం

అన్ని రంగాలతో పాటు ఉన్నత విద్యలో కూడా తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ గురుకులాలను ప్రారంభించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఈ పాఠశాలలు: సీఎం

జనవరి 11న హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్, బీడీఎస్, ఐఐటీ, ఎన్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యారి్థనీ, విద్యార్థులకు ఆయన ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో ఐఐటీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి రూ.50 వేలు, ఎన్ ఐటీ, బీడీఎస్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.40 వేల చొప్పున చెక్కులు, ఐఐటీ విద్యనభ్యసిస్తున్న వారికి ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల ద్వారా 981 స్కూళ్లలో 5.40 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. లా, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, సైనిక్ స్కూల్, బాలికలకు డిగ్రీ కాలేజీలు నడుపుతున్నామని, గురుకుల విద్యార్థులు పది, ఇంటర్, డిగ్రీ ఫలితాలతో పాటు జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్, విద్యార్థులు, అధికారులు, సిబ్బందిని కొప్పుల అభినందించారు.

చదవండి: 

గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య

Gurukulam: ఐఐటీ, జేఈఈ మెయిన్‌లో గురుకులాల రికార్డు

గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్లలో సగం సీట్లు స్థానికులకే!

#Tags