Skill University: తక్షణ ఉపాధి లభించే నైపుణ్య కోర్సులు.. పలు కోర్సులు సూచించిన వర్సిటీలు

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ, బీటెక్‌ తర్వాత తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నైపుణ్య విశ్వవిద్యాలయం దీనిపైనే దృష్టి పెట్టింది. నైపుణ్యం అందించే కోర్సులపై పలు యూనివర్సిటీల నిపుణులతో ఆరా తీసింది.

ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ కూడా స్కిల్‌ కోర్సులపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆమోదించిన స్కిల్‌ కోర్సుల వైపు రాష్ట్రంలోని వర్సిటీలు, స్కిల్స్‌ వర్సిటీ ప్రత్యేక అధ్యయనం చేపట్టాయి. ఇప్పటికే కొన్ని నైపుణ్య కోర్సులను ఉన్నత విద్యా మండలి (హెచ్‌ఈసీ) గుర్తించింది.

డిగ్రీ స్థాయిలో వీటి కాంబినేషన్‌తో కోర్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉపాధి లభించే కోర్సులను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కసరత్తు ముమ్మరం చేశామని హెచ్‌ఈసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ‘సాక్షి’కి తెలిపారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. 

చదవండి: Free training on computer skills: కంప్యూటర్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం

స్కిల్స్‌ వర్సిటీ ఆరా 

స్కిల్స్‌ యూనివర్సిటీ అధికారులు నైపుణ్య కోర్సులపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులు పట్టాలతో మార్కెట్లోకి వస్తున్నా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉండటం లేదని గుర్తించారు. ఇంటర్‌ ఉత్తీర్ణులై, డిగ్రీ, బీటెక్‌లో చేరే వారికి ముందుగా 3 నుంచి 6 నెలల కాలపరిమితితో కొన్ని స్కిల్‌ కోర్సులు అందించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ కోర్సులకు యూజీసీ కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఒకేషనల్‌ విద్యను జనరల్‌ విద్యతో సమ్మిళితం చేయాలన్నది యూజీసీ ఆలోచన. స్కిల్‌ కోర్సులు పూర్తిగా అకడమిక్‌గా ఉండకుండా, పూర్తిగా పరిశ్రమల్లో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పొందేలా రూపొందించాలని సూచించింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని స్కిల్స్‌ వర్సిటీ ఇటీవల వర్సిటీల నిపుణులతో స్కిల్‌ కోర్సులపై ఆరా తీసింది. ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌తో పాటు పలు విశ్వవిద్యాలయాలు కొన్ని కోర్సులను సూచించాయి. ఇవన్నీ యూజీసీ ఆమోదించినవే కావడం గమనార్హం.  

కోర్సులివీ.. 

వర్సిటీలు ప్రతిపాదిస్తున్న సర్టిఫికెట్‌ కోర్సుల్లో..మెషీన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఏఐ అండ్‌ రోబోటిక్స్, ఐవోటీ.. ఇండస్ట్రియల్‌ ఐవోటీ, స్మార్ట్‌ సిటీస్, డేటాసైన్స్‌ అండ్‌ అనలిస్ట్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ అండ్‌ ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ, డిజిటల్‌ ప్లూయెన్సీ..డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటివి ఉన్నాయి.

ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్స్, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్, బేసిక్‌ కోడింగ్‌ ఇన్‌ కంప్యూటింగ్‌ లాంగ్వేజెస్, మెకట్రానిక్స్‌ వంటి కోర్సులను కొన్ని వర్సిటీలు సూచించాయి.

ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్టింగ్, బేసిక్‌ 3డీ డిజైన్, బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్, 3డీ ప్రింటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ కమ్యూనికేషన్, మొబైల్‌ రిపేరింగ్‌ అండ్‌ బేసిక్స్‌ ఆఫ్‌ డీటీహెచ్‌ ఇన్‌స్టాలేషన్, డిజిటల్‌ మార్కెటింగ్, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ తదితరాలు కూడా ఉన్నాయి.

వీటన్నిటినీ ఆయా రంగాల్లో నిపుణులు బోధించేలా చూడాలని సూచించాయి. యోగిక్‌ సైన్సెస్, సాఫ్ట్‌ స్కిల్స్, బేసిక్స్‌ ఆఫ్‌ స్టార్టప్స్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెçన్యూర్‌షిప్స్‌లో స్టార్టప్స్‌లో విజయం సాధించిన నిపుణుల భాగస్వామ్యాన్ని సూచిస్తున్నాయి. ప్రతి కోర్సుకు 12 నుంచి 30 క్రెడిట్స్‌ ఇవ్వాలని తెలిపాయి.   

#Tags