Tenth Board Exams : టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు మోడల్ పేపర్ విడుదల..
సాక్షి ఎడ్యుకేషన్: టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందన్న విషయం తెలిసిందే. అయితే, విద్యార్థులు వారి పరీక్షలకు సులువుగా సన్నద్ధమైయ్యేలా, వారికి ఉపయోగపడేలా ప్రభుత్వం మోడల్ పేపర్‌ను విడుదల చేసింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, వారి బోర్డు పరీక్షలకు సిద్ధం అవ్వాలని తెలిపారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఈ పదో తరగతి పరీక్ష మోడల్ పేపర్లను ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు దీనిని పూర్తిగా వినియోగించుకొని వచ్చే పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని కోరారు. అంతేకాదు, యూటీఎఫ్ విద్యారంగ, ఉపాధ్యాయసమస్యల పరిష్కారం కోసం పోరాటు చేయడమే కాకుండా మోడల్ టెస్ట్ పేపర్లు ప్రచురించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రామప్పచౌదరి, శేఖర్, శ్రీనివాసులు, జయరాములు, లక్ష్మీనారాయణ, ఎర్రిస్వామి, శ్రీధర్ పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)