Telangana Schools and Colleges Holidays : ఈ స్కూళ్లు, కాలేజీల‌కు రెండు రోజులు సెలవులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల ప‌ర్వం కొన‌సాగుతోంది. జూన్ 29వ తేదీనే బ‌క్రిద్ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఒక రోజులు గ్యాప్‌లోనే మ‌రోసారి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులను విద్యాశాఖ ప్రకటించింది.
TS Schools and Colleges Holidays Details in Telugu

ఎందుకంటే.. జూలై 1న జరిగే గ్రూప్‌-4 పరీక్ష టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హిస్తుంది. ఈ నేప‌థ్యంలో.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు.. జూలై 1వ తేదీ (శ‌నివారం) పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

☛ TSPSC Group 4 Exam News Rules : గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..! ఈ వస్తువులకు నో ఎంట్రీ..

అలాగే త‌ర్వాత రోజు ఆదివారం.. సాధార‌ణంగా ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. దీంతో వ‌రుసగా రెండు రోజులు పాటు స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు రానున్నాయి. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ 'డే' గా విద్యాశాఖ ప్రకటించింది.

మొత్తం 9 లక్షల 50 వేలమంది..

రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో గ్రూప్‌-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

#Tags