Holidays List 2025: సెలవుల్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్‌.. సెలవుల జాబితా ఇదే..

హైదరాబాద్‌, సాక్షి: వచ్చే ఏడాది సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025లో ప్రభుత్వ సెలవులతో కూడిన జీవోను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 27 జనరల్‌, 23 ఆఫ్షనల్‌ హాలీడేస్‌ ఉన్నాయి.

వచ్చే ఏడాదిలో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీ(జూన్‌ 2) సెలవుల జాబితాలో లేకపోగా.. బోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం (నవంబర్ 9, 2024) ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: TG Universities: యూనివర్సిటీల్లో నాణ్యత మెరుగుకు కావాల్సినవి ఇవే.. బోధన సిబ్బంది పరిస్థితి ఇదీ..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ జాబితా ప్రకారం సెలవులను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండో శనివారాల్లో, ఆదివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

2025 సెలవుల జాబితా ఇది..

న్యూ ఇయర్ డే

 01-01-2025 (బుధవారం)

భోగి

13-01-2025 (సోమవారం)

సంక్రాంతి

14-01-2025 (మంగళవారం)

రిపబ్లిక్ డే

 26-01-2025 (ఆదివారం)

మహా శివరాత్రి

 26-02-2025 (బుధవారం)

హోలీ

 14-03-2025 (శుక్రవారం)

ఉగాది

 30-03-2025 (ఆదివారం)

ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్)

 31-03-2025 (సోమవారం)

రంజాన్ తరువాతి రోజు

 01-04-2025 (మంగళవారం)

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

05-04-2025 (శనివారం)

శ్రీరామ నవమి

 06-04-2025 (ఆదివారం)

బీఆర్‌ అంబేద్కర్ జయంతి

 14-04-2025 (సోమవారం)

గుడ్ ఫ్రైడే

 18-04-2025 (శుక్రవారం)

ఈదుల్ అజా (బక్రీద్)

 07-06-2025 (శనివారం)

మొహరం

 06-07-2025 (ఆదివారం)

బోనాలు

 21-07-2025 (సోమవారం)

స్వాతంత్య్ర దినోత్సవం

15-08-2025 (శుక్రవారం)

శ్రీ కృష్ణాష్టమి

16-08-2025 (శనివారం)

వినాయక చవితి

27-08-2025 (బుధవారం)

ఈద్ మిలాదున్ నబీ

 05-09-2025 (శుక్రవారం)

బతుకమ్మ పండుగ ప్రారంభ రోజు

 21-09-2025 (ఆదివారం)

మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి

02-10-2025 (గురువారం)

విజయ దశమి తరువాతి రోజు

03-10-2025 (శుక్రవారం)

దీపావళి

20-10-2025 (సోమవారం)

కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి

05-11-2025 (బుధవారం)

క్రిస్మస్

25-12-2025 (గురువారం)

క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)

26-12-2025 (శుక్రవారం)

#Tags