Madhiri Eallanna: జాతీయ పుస్తక నిలయంలో ఉపాధ్యాయుడికి సభ్యత్వం

కుంటాల: మండలంలోని పెంచికల్‌పాడ్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదరి ఎల్లన్న 2023 విద్యా సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు నామినేట్‌ అయ్యారు.
జాతీయ పుస్తక నిలయంలో ఉపాధ్యాయుడికి సభ్యత్వం

 భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ పుస్తక నిలయంలో ఎల్లన్నకు సభ్యత్వం కల్పించారు. ఏటా రూ.10,900 విలువ గల పుస్తకాలను ఈ మెయిల్‌ ద్వారా పాఠశాలకు పంపుతారు. న్యూఢిల్లీ జాతీయ పుస్తక నిలయం డైరెక్టర్‌ యువరాజ్‌ మాలిక్‌ పాఠశాలలో పిల్లలకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అక్టోబ‌ర్ 26న‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లన్నను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, భీమేష్‌, ప్రియాంక, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Election Commission: సారూ... జర జాగ్రత్త!

నాగజ్యోతికి విద్యాశాఖ కమిషనర్‌ అభినందన

#Tags