Degree Admissions: విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోండి

గద్వాల అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, చిరు ఉద్యోగులు, రెగ్యులర్‌గా చదువుకునే వీలు లేనివారు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

సెప్టెంబ‌ర్ 16న‌ జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డి డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ డిగ్రీకి సంబంధించిన పోస్టర్ల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పలు కారణాలతో రెగ్యులర్‌ విద్యను మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు కూడా ఓపెన్‌ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.

చదవండి: PSHM Association: పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు వీరికి ఇవ్వాలి

వివిధ వృత్తుల్లో పనిచేస్తూ సైతం ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులను పూర్తి చేసుకునే అవకాశం ఉందని వివరించారు. ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు చదువుకోవచ్చని పేర్కొన్నారు.

సెప్టెంబ‌ర్ 30వ తేదీ వరకు ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్లకు అవకాశం ఉందని, ఈ కోర్సులు పోటీ పరీక్షలకు సైతం ఉపయోపడతాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కౌన్సిలర్లు కిషోర్‌ రెడ్డి, వెంకన్న, ప్రేమయ్య, మల్లయ్య, కళాశాల స్టాఫ్‌ శంకర్‌, జ్యోతి తదితరులు ఉన్నారు.

#Tags