Professor KR Rajini: విద్యార్థులు లక్ష్యాలతో ముందుకు సాగాలి

ఎచ్చెర్ల క్యాంపస్‌: విద్యార్థులు లక్ష్యాలతో ముందుకు సాగాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాల యం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజిని అన్నారు.

వర్సిటీలోని కామర్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థులు ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఫిబ్ర‌వ‌రి 13న‌ నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు సాధించాలని అన్నారు.

చదవండి: Top 500 Companies: 500 కంపెనీల్లో 'రిలయన్స్‌ ఇండస్ట్రీస్' టాప్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే..

సమయ పాలన, క్రమశిక్షణ రెండూ విద్యార్థులకు అవసరమని వివరించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నిరంతరం నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టిపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫె సర్‌ బిడ్డిక అడ్డయ్య, హానరీ ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, కోర్సు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నీలం సంతోష్‌ రంగనాఽథ్‌ పాల్గొన్నారు.

చదవండి: Anandi Singh Rawat: పిల్లల మనసులను చదవాలి.. వారిని అర్థం చేసుకోవడమే ముఖ్యం

#Tags