ARS College: ఎగ్జామ్‌ సెంటర్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

జన్నారం: డిగ్రీ ఫైనల్‌ పరీక్షలకు ఎగ్జామ్‌ సెంటర్‌ను లక్సెట్టిపేటకు తరలించడంపై జన్నారం మండల కేంద్రంలో విద్యార్థులు రోడ్డెక్కారు.

 ఏఆర్‌ఎస్‌ కళాశాల విద్యార్థులు టీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై డిసెంబ‌ర్ 18న‌ రాస్తారోకో చేశారు. వీరికి ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు. తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జన్నారంలో ఉన్న డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని లక్సెట్టిపేటకు తరలించడం సరికాదన్నారు.

చదవండి: National Maths Day: ‘గణితంలో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థానం’

సెంటర్‌ తరలింపుతో 40 కిలోమీటర్ల దూరం వెళ్లి పరీక్ష రాయడానికి విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని జన్నారంలో కొనసాగించాలని కోరా రు. కార్యక్రమంలో ఏబీవీపీ అధ్యక్షుడు మనీ ష్‌కుమార్‌, టీఎస్‌యూ మండల అధ్యక్షుడు జీయాయొద్దీన్‌, మండల నాయకులు రాకేశ్‌, ప్రశాంత్‌, సాగర్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags