Jana Vigyan Vedika: విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
పంజగుట్ట: విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని హైదరాబాద్ డీఈఓ రోహిణి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబురాల్లో భాగంగా నవంబర్ 7న రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల స్థాయి ప్రశ్నపత్రాన్ని ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలనే కుతూహలంతో ఉండాలని, ప్రతీ విషయాన్ని పరిశోధించాలని అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారని సూచించారు. గత 30 ఏళ్లుగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను జన విజ్ఞాన వేదిక వెలికితీయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యరద్శి రాజా, డిప్యుటీ ఈఓ శామ్యూల్ రాజ్, స్కూల్ ఇన్‌చార్జి ఆర్.గోపాల్, ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు, డాక్టర్ రజని, లింగస్వామి, ఎం.రవీంద్రబాబు, వై.యాదగిరి, చాగంటి సాయి తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags